ప్రియుడితో సినిమాకెళ్లి.. తండ్రికి దొరికేసింది..

ప్రియుడితో సినిమాకెళ్లి.. తండ్రికి దొరికేసింది..

స్పెషల్‌ క్లాస్‌ అని చెప్పి ఇంటి నుంచి బయటికొచ్చిన ఓ యువతి.. ప్రియుడితో కలిసి సినిమాకెళ్లింది. ప్రేమికులిద్దరూ థియేటర్‌కు చేరుకుని.. టికెట్ కూడా తీసుకున్నారు. తమకు కేటాయించిన సీట్లలో ఎంచక్కా కూర్చున్నారు. సినిమా ప్రారంభమైంది.. కానీ..అక్కడే సీన్‌ రివర్స్‌ అయింది. వారి వెనుక సీట్లోని వ్యక్తి.. తమ ముందు కూర్చున్న యువతి తన కూతురేనని గుర్తించాడు.  ఓ యువకుడితో కలిసి తన కూతురు సినిమాకొచ్చిందని తెలిసి ఆ తండ్రి.. కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. కూతురిని బయటవరకు ఈడ్చుకుంటూ వచ్చి చితకబాదాడు. అడ్డువచ్చిన ప్రేమికుడిని కూడా చావబాదాడు. ఈ ఘటన వరంగల్‌లోని ఎస్‌2 సినిమా హాల్లో నిన్న జరిగింది.