లేడిస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు

లేడిస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు

చెన్నైలోని ఓ లేడీస్ హాస్టల్ లో కలకలం రేగింది. అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు నిర్వహించగా బెడ్ రూమ్, బాత్ రూమ్, కరెంట్ ప్లగ్స్, బట్టలు మార్చుకునే స్థలంలో రహస్య కెమెరాలు బయటపడ్డాయి. దీంతో హాస్టల్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని ఆదంబాకంలో సంజీవ్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం లేడీస్ హాస్టల్ ను ప్రారంభించాడు. ఒక్కక్కరికి రూ. 5,500, సెక్క్యూరీటి డిపాజిట్ కింద రూ.20 వేలు వసూలు చేస్తున్నాడు.

గత కొద్దిరోజుల క్రితం సంజీవ్ హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు. అతడి తీరుపై హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతికి అనుమానం వచ్చింది. వెంటనే మొబైల్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసి.. సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది. బెడ్‌రూమ్, బాత్ రూమ్‌లు, బట్టలు తగిలించుకునే హ్యాంగర్లతో పాటూ కొన్ని చోట్ల రహస్య కెమెరాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

తనిఖీల్లో అత్యాధునిక సౌండ్ సెన్సిటివ్ కెమెరాలు బయటపడటం గమనార్హం. హస్టల్ లోని ఓ అమ్మాయికి బాత్ రూమ్ లోని కరెంట్ ప్లగ్ లో ఏదో ఉందనే అనుమానం రావడంతో స్విచ్ బోర్డును పరిశీలించగా మొదటి కెమెరా బయటపడిందని పోలీసులు మీడియాకు తెలిపారు. హాస్టల్ యజమాని సంజీవ్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటనలు ఇస్తూ అమ్మాయిలను హాస్టల్ కు రప్పిస్తున్నాడని విచారణలో తేలిందని అన్నారు.