ఐపీఎల్ కోసం యూఏఈకి బయల్దేరిన మహిళల జట్లు... 

ఐపీఎల్ కోసం యూఏఈకి బయల్దేరిన మహిళల జట్లు... 

ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడిన పురుషుల ఐపీఎల్ సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ నవంబర్ 10న ముగుస్తుంది. అయితే బీసీసీఐ అధికారులు పురుషుల ఐపీఎల్ ముగిసే చివర అంటే నవంబర్ 4 నుండి 9 వరకు యూఏఈ వేదికగా మహిళల ఐపీఎల్ జరుగుతుంది బీసీసీఐ తెలిపింది. అయితే ఈ రోజు ఆ టోర్నీలో పాల్గొనడానికి ప్లేయర్స్ యూఏఈకి ఈ రోజు బయల్దేరారు. దానికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే మొదట ఈ ఏడాది 4 జట్లతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు దాదా చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా 3 జట్లతోనే బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహిస్తుంది. ఈ మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, మిథాలీ రాజ్ న్యాయకత్వం వహించనున్నారు. ఇక మూడు జట్లతోనే జరుగుతున్న ఈ లీగ్ లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే జరుగుతాయి. అయిన పురుషుల ఐపీఎల్ కు ఏ విధమైన కరోనా నియమాలు వర్తిస్తాయో మహిళల ఐపీఎల్ కు కూడా అవే నియమాలు వర్తిస్తాయి.