సైంటిస్ట్ కు పరిహారంగా అర కోటి ఇవ్వండి

 సైంటిస్ట్ కు పరిహారంగా అర కోటి ఇవ్వండి

ఇస్రోకు చెందిన మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్ కు రూ. 50 లక్షలను పరిహారంగా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇస్రోకు చెందిన క్రియోజనిక్ టెక్నాలజీకి సమాచారాని పాకిస్తాన్, రష్యాకు చెందిన ఓ మహిళా గూఢచారికి చేరవేశారంటూ నారాయణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐ విచారించింది. సరైన ఆధారాలు  లేవని సీబీఐ తెలపడంతో కేసు కొట్టేశారు. తనను అనవసరంగా అరెస్ట్‌ చేసి మానసికంగా వేధించారంటూ పరిహారం కోరుతూ నారాయణన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నారాయణన్ కు రూ. 50 లక్షల పరిహారం  చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడమే గాక.. ఆయన అరెస్ట్‌ చేయడంలో పోలీసుల పాత్రను విచారించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ డీకే జైన్‌ నేతృత్వంలో ఓ కమిటీని కూడా సుప్రీం కోర్టు నియమించింది.