ఓల్డ్ ఈజ్ గోల్డ్‌... గ్లాసీ హెయిర్ బ్యాక్‌

ఓల్డ్ ఈజ్ గోల్డ్‌... గ్లాసీ హెయిర్ బ్యాక్‌

ఉంగరాల జుట్టువాడు.. ఒడ్డు పొడుగు ఉన్నవాడు.. అంటూ గతంలో అమ్మాయిలంతా తమ కలల రాకుమారుణ్ని ఊహించుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒడ్డూ-పొడుగూ స్థానంలో స్లీక్ అండ్ ఫిట్నెస్ బాడీకి ప్రయారిటీ వచ్చేసినట్టే ఉంగరాల జుట్టును గ్లాసీ హెయిర్ ఆక్రమించింది. నల్లని కురులు వంకర్లు పోకుండా మెరిసే జలపాతంలా కిందికి దుముకుతూ ఉండేలా వేళ్లాడేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. 

పొట్టిగా కట్ చేసిన బాబ్డ్ హెయిర్ ను వంకీలు లేకుండా మెరిసిపోయేలా నల్లగా పాలిష్ చేసి గ్లాసీలా ఉంచుకోవడంలో కిమ్ కర్దాషియా, రిహన్నా, జెన్నా దీవాన్ వంటి సెలబ్రిటీలు కొత్త ట్రెండ్ సృష్టించారు. హాలీవుడ్ లో పాపులర్ అయిపోయిన ఈ ట్రెండ్ బాలీవుడ్ కూ పాకింది. ఇక మన దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కిమ్ కర్దాషియా లాగా ఇండియాలో ట్రెండ్ ఎవరు సృష్టిస్తారూ.. ఇలియానానా లేక కేథరినా అంటూ అంచనాలు కూడా మొదలయ్యాయి.