గ్లెన్ మాక్స్వెల్ : ఐపీఎల్ కూడా ప్రపంచ కప్ లాంటిదే...

గ్లెన్ మాక్స్వెల్ : ఐపీఎల్ కూడా ప్రపంచ కప్ లాంటిదే...

ఈ ఏడాది జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ 2020 వాయిదాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఆ తరువాతి రోజే యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 జరుగుతుంది అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించాడు. కానీ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. ఇక ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించబోయే గ్లెన్ మాక్స్వెల్, కరోనా కు సంబంధించిన అని జాగ్రత్తలు బీసీసీఐ తీసుకుంటేనే నేను ఈ టీ 20 లీగ్‌లో పాల్గొంటాను అని తెలిపాడు. నేను ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండటం వలన ఫిట్నెస్ మరియు మనస్సును ఇంకా దృఢంగా చేసుకున్నాను అని చెప్పాడు. ఇక టీ 20 ప్రపంచ కప్ వాయిదా గురించి మాట్లాడుతూ... ఐపీఎల్ కూడా ప్రపంచ కప్ లాంటిదే కానీ కొంచెం చిన్నది. ఇక నేను క్రికెట్ లోకి తిరిగి రావడానికి ఎల్లప్పుడూ మానసికంగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఇక గత ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ కి ప్రాతినిధ్యం వహించిన మాక్స్వెల్ ఇప్పుడు పంజాబ్ తరపున ఆడబోతున్నాడు.