కఠినమైన పరిస్థితులలో బ్యాటింగ్ చేయడానికి కోహ్లీ పనికిరాడు..

కఠినమైన పరిస్థితులలో బ్యాటింగ్ చేయడానికి కోహ్లీ పనికిరాడు..

విరాట్ కోహ్లీ మరియు కేన్ విలియమ్సన్, తమ జట్లకు కెప్టెన్లుగా ఉండటం మాత్రమే కాకుండా, ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్మెన్లలో ఉన్నారు. అయితే వీరిద్దరి లో అత్యుత్తమ ఆటగాడిని ఎంచుకోవాలని న్యూజిలాండ్ మాజీ బాట్స్మెన్ గ్లెన్ టర్నర్ ను అడిగినప్పుడు, వారు ఆడుతున్న పరిస్థితులు మరియు వారి వ్యక్తిత్వాలకు విరుద్ధంగా, కఠినమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయలేడు కాబట్టి కేన్ విలియమ్సన్‌ను ఎంచుకుంటానని తెలిపాడు. అయితే, విలియమ్సన్ కంటే కోహ్లీ మరింత దూకుడుగా కనపడుతున్నప్పటికీ, గెలవటానికి ఉన్న తపన మాత్రం ఇద్దరిలో సమానంగా ఉంటుంది. కోహ్లీ సీమింగ్ పిచ్‌లు మరియు బ్యాటింగ్ కు సహకరించే పిచ్ లపైనే ఎక్కువ ఆడాడు, అయితే విలియమ్సన్ స్వింగ్ మరియు సీమర్‌లకు అనుకూలమైన పరిస్థితులలో ఆడాడు" అని ఆయన చెప్పారు. అందుకే కఠినమైన పరిస్థితులలో బ్యాటింగ్ చేయడానికి, నేను విలియమ్సన్‌ ను కోహ్లీ కంటే మెరుగైన ఆటగాడిగా ఎనుకుంటాను అని టర్నర్ వివరించాడు. ఇక కోహ్లీ 86 టెస్టుల్లో 53.62 సగటుతో 7240 పరుగులు చేయగా, విలియమ్సన్ 80 టెస్టుల్లో 6416 పరుగులు చేసి 51.63 సగటు సాధించాడు.