తాత మనవళ్ల హంగామా..!!

తాత మనవళ్ల హంగామా..!!

సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ప్రతి రోజు పండుగే సినిమాకు సంబంధించిన చిన్న గ్లింపేజ్ ను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు. సాయిధరమ్, సత్యరాజ్ కు తాత మనవాళ్లుగా నటిస్తున్నారు.  మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ కు చెందిన జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  తాతగా సత్యరాజ్ హంగామా చేస్తుంటే.. మనవడు తాతతో కలిసి స్టెప్పులు వేస్తున్న చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  

ఇక ఈ సినిమాలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేశారు.   రాశిఖన్నా మరింత అందంగా కనిపిస్తోంది. రావు రమేష్, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.  స్వచ్ఛమైన పల్లెటూరికి చూపిస్తూ గ్లింపేజ్ కట్ చేశారు.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.