'జీ-మెయిల్'లో కొత్త ఫీచర్లు...

'జీ-మెయిల్'లో కొత్త ఫీచర్లు...
సోషల్ మీడియా వేదికలు ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో రోజు రోజుకి కొత్త ఫీచర్లను చేర్చుతున్నారు ఆ సంస్థ యజమానులు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది గూగుల్ సంస్థ. జీ-మెయిల్ లో ఎన్నో కొత్త ఫీచర్లు త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది గూగుల్. జీమెయిల్ కు కొత్త వెబ్ డిజైన్ ను తీసుకువచ్చే పనిలో ఉంది గూగుల్ సంస్థ. ఈ క్రమంలో జీ-మెయిల్ కు 'కాన్ఫిడెన్షియల్ మోడ్'ను జోడించనుంది. ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్ ప్రకారం... ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ను వారు మరొకరికి ఫార్వార్డ్ చేయకుండా, కాపీ చేసుకోకుండా చేయవచ్చు. అంతేకాదు ఆ మెయిల్ ను ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఇక మనకు వచ్చిన మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే పాస్ కోడ్ అవసరం. ఈ పాస్ కోడ్ ను టెక్ట్స్ మెసేజ్ ద్వారా గూగుల్ పంపిస్తుంది. పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయిరీ డేట్ ను సైతం సెట్ చేసుకోవచ్చు.