బలపరీక్షలో నెగ్గిన గోవా సీఎం

బలపరీక్షలో నెగ్గిన గోవా సీఎం

గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ప్రమోద్ సావంత్ బల నిరూపణ పరీక్షలో నెగ్గారు. 20 మంది ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్‌ సావంత్‌కు మద్దతు తెలిపారు. దీంతో గోవా గవర్నర్ మృదులా సిన్హా  సీఎం ప్రమోద్‌ సావంత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. మనోహర్ పారికర్ మృతిచెందడంతో.. సీఎంగా ప్ర‌మోద్ సావంత్ మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ప్ర‌మాణం చేశారు. దీంతో సీఎం సెంబ్లీలో త‌న మెజారిటీ నిరూపించుకోవాలని గోవా గవర్నర్ మృదులా సిన్హా  తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం సావంత్ త‌న మెజారిటీ నిరూపించుకున్నారు. ఇక గోవాలో బీజేపీ ప్రబుత్వంను ఏర్పాటు చేయనుంది.