మేకను రేప్‌ చేసిన 8 మంది

మేకను రేప్‌ చేసిన 8 మంది

గర్భంతో ఉన్న ఏడేళ్ళ మేకు 8 మంది రేప్‌ చేసిన ఘటన హర్యానాలోని మేవత్‌ జిల్లాలో జరిగింది. ఈ మేరకు మేక యజమాని అస్లుప్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మేవత్‌ జిల్లా  మరోడా గ్రామానికి చెందిన ఎనిమిది రౌడీ షీటర్లు గర్భంతో ఉన్న తన మేకను రేప్‌ చేశారని ఖాన్‌ ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం ఓ రౌడీమూక మేకను తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా, తాను అడ్డుకున్నానని.. రాత్రి మేకను రేప్‌ చేశారని..  మేక అరుపులకు లేచి చూసి సరికి నిందితులు పారిపోయారని.. కాని వారిలో ముగ్గురిని గ్రామస్థులు పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. వారిపై సెక్షన్‌ 377 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మేక అప్పటికపుడే చనిపోయింది.ఈ నేరం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు సాక్ష్యాలు, నిందితుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ నజ్నీన్‌ భాసిన్‌ మీడియాకు తెలిపారు. బుధవారం రాత్రి ఇంటి వద్ద మేక కన్పించకపోతే... గ్రామంలో వెతికానని, ఓ షెడ్‌లో అరుపులో వినిపించగా.. అక్కడికెళ్ళి చూడగా.. ముగ్గురు మేకను లైంగికంగా వేధిస్తుండగా తాను చూశానని అస్లుప్‌ చెప్పారు. మిగిలినవారు కూడా రేప్‌ చేసినట్లు ఆ ముగ్గురు తనకు చెప్పారని.. అయితే తనను బాగా కొట్టారని.. తాగి ఉండటంతో వారిని తాను ఏమీ చేయలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.