భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక...

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక...

గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది... ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 48.3 అడుగులకు చేరుకోగా... రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించగా... సబ్ కలెక్టరేట్‌లో నెంబర్: 08743-232444తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు.