గుడ్‌న్యూస్‌... బంగారం ధ‌ర త‌గ్గింది..

గుడ్‌న్యూస్‌... బంగారం ధ‌ర త‌గ్గింది..

వ‌రుస‌గా పెరుగుతూ... ఆల్ టై హై రికార్డుకెక్కిన బంగారం ధ‌ర‌... మ‌ళ్లీ దిగివ‌చ్చింది... అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా.. దేశీయ‌ మార్కెట్‌లో మాత్రం ప‌డిపోయింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించి.. రూ.58,690కి ప‌డిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 క్షీణతతో రూ.53,800కు దిగొచ్చింది. ఇక‌, ప‌సిడి దారిలోనే వెండి ధ‌ర కూడా కింద‌కు దిగింది.. ఏకంగా రూ.2310 ప‌త‌నం కావ‌డంతో.. కిలో వెండి ధర రూ.74,200కి ప‌రిమిత‌మైంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ప‌సిడి ధ‌ర మాత్రం పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.8 శాతం పైకి కదిలి.. 2034 డాలర్లకు చేర‌గా.. ఇక‌, వెండి ధర ఔన్స్‌కు 2.69 శాతం పెరుగుదలతో 28.28 డాలర్లకు ఎగసింది.