బ్యాడ్ న్యూస్‌... మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌

బ్యాడ్ న్యూస్‌... మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌

ఆల్‌టైం హై రికార్డు ధ‌ర‌ను అందుకుని.. వ‌రుస‌గా నాలుగు రోజుల‌పాటు త‌గ్గుతూ బంగారం ప్రేమికులు గుడ్‌న్యూస్ చెప్పింది పిసిడి.. కానీ, ఇవాళ మ‌ళ్లీ షాక్ ఇచ్చింది.. ఒక్కసారిగా భారీగా పెరిగింది..  అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా.. దేశీయ మార్కెట్‌లో మాత్రం పెరిగిపోయింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పెరిగి.. రూ.55,500కు చేరుకోగా.. ఇక‌, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 పెరిగి రూ.51,050కు ఎగిసింది. మ‌రోవైపు వెండి ధ‌ర కూడా ప‌సిడి బాట‌నే ప‌ట్టింది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 పెర‌గ‌డంతో రూ.67,000కు పెరిగింది. 

అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగివ‌చ్చింది.. పసిడి ధర ఔన్స్‌కు 0.25 శాతం క్షీణించి.. బంగారం ధర ఔన్స్‌కు 1966 డాలర్లకు తగ్గింది. ఇక‌, వెండి ధర ఔన్స్‌కు 1.04 శాతం తగ్గుదలతో 27.42 డాలర్లకు దిగొచ్చింది.  అంత‌ర్జాతీయ మార్కెట్ ధ‌ర‌ల‌తో సంబంధం లేకుండా దేశీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర మ‌రోసారి పైకి క‌దిలిన‌ట్టు అయ్యింది.