పసిడి ధర తగ్గింది..

పసిడి ధర తగ్గింది..

కొత్త రికార్డులు సృష్టించేదిశగా పరుగులు పెట్టిన పసిడి ధర ఓరోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ వస్తోంది. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి. 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గగా.. కిలో వెండి ధర రూ.150 తగ్గింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.35,730కి చేరగా.. 22 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,560గా ఉంది. మరోవైపు బులియన్ మార్కెట్‌లోకూ బంగారం ధర తగ్గింది. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,510కి పలికింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ కాస్త తగ్గడంతో పసిడి ధర స్వల్పంగా తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కిలో వెండి ధర రూ. రూ.150 తగ్గడంతో హైదరాబాద్‌లో రూ.44,835గా పలికింది.