ఆరేళ్లలో గరిష్టస్థాయికి బంగారం ధరలు..!!

ఆరేళ్లలో గరిష్టస్థాయికి బంగారం ధరలు..!!

దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆరేళ్లలో గరిష్టస్థాయికి చేరుకున్నాయి.  ధరలు పెరిగిపోవడంతో కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.  మనదేశంలో విపణిలో విక్రయించే బంగారం దిగుమతి చేసుకున్నదే కావడంతో అంతర్జాతీయంగా డాలర్ విలువపై ఆధారపడి ధరలు మార్పులు చెందుతుంటాయి.  డాలర్ విలువ అంతర్జాతీయంగా తగ్గడంతో పాటు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో.. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.  

దీంతో బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.  సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ. 37,000/- గా ఉన్నది.  గత ఆరేళ్లలో ఈ స్థాయికి బంగారం ధరలు చేరుకోవడం విశేషం.  అటు వెండిధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ. 43,000/- గా ఉన్నది.