బంగారం మళ్ళీ పతనం... వెండి కూడా అదే బాటలో... 

బంగారం మళ్ళీ పతనం... వెండి కూడా అదే బాటలో... 

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో ఇండియా ఒకటి.  నిత్యం ఇండియా వివిధ దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది.  దేశంలో బంగారం ధరలు సామాన్యులకు ఎప్పుడు అందుబాటులో ఉండవు.  అయితే, గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయి.  అంతర్జాతీయంగా ఉన్న ఆర్థికమాంద్యంతో పాటుగా చైనాలో కరోనా ప్రభావం కూడా దీనిపై పడుతున్నది.  దీంతో పాటుగా డాలర్ తో రూపాయి విలువ పెరగడం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పాలి.  ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.  తగ్గిన ధరలను బట్టి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.  

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 880 తగ్గి రూ. 41,880 కి చేరుకుంది.  అలానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 850 తగ్గి రూ. 38,380 కి చేరింది.  ఇదిలా ఉంటె వెండి కూడా ఇదే బాటలో పయనించింది.  కిలో వెండి రూ. 1990 తగ్గి రూ. 48,000కు పడిపోయింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.