స్వల్పంగా  పెరిగిన పుత్తడి ధరలు... ఎంతంటే... 

స్వల్పంగా  పెరిగిన పుత్తడి ధరలు... ఎంతంటే... 

గత  కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా డాల‌ర్ విలువ పెర‌గ‌డంతో పాటుగా దేశీయంగా కూడా క‌రోనా కేసుల ప్ర‌భావం బంగారం ధ‌ర‌ల‌పై ప‌డింది.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 250 పెరిగి రూ.41,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధ‌ర రూ.270 పెరిగి రూ.45,490కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా స్వ‌ల్పంగా పెరిగాయి.  కిలో వెండి ధ‌ర రూ.200 పెరిగి 70,100కి చేరింది.