మళ్ళీ పడిపోయిన బంగారం ధరలు - కారణం అమెరికానే... 

మళ్ళీ పడిపోయిన బంగారం ధరలు - కారణం అమెరికానే... 

పసిడి ఎప్పుడు వెలుగులు చిందిస్తూనే ఉంటుంది.  కానీ, గత కొంతకాలంగా దేశంలో డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది.  దీంతో దేశంలో ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  ఒక మన దేశంలోనే కాకుండా, అమెరికా దేశాల వంటి ప్రభావం కూడా బంగారం ధరలపై ఉన్నది.  గత కొన్ని రోజులుగా వినియోగదారులు బంగారంపై శ్రద్ద పెట్టకపోవడంతో డిమాండ్ తగ్గింది.  దీనికి తోడుగా అమెరికా ఆర్ధిక పరిస్థితి గతంతో పోలిస్తే బాగుందని చెప్పి ఫెడరల్ చైర్మన్ చెప్పడంతో దాని ప్రభావం బంగారం పై పడింది.  

దీంతో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి.  ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 38,640కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి రూ. 42,150కి చేరింది.  ఇక కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 48,800 కి చేరింది.