మహిళలకు గుడ్ న్యూస్: దిగొస్తున్న బంగారం ధరలు... 

మహిళలకు గుడ్ న్యూస్: దిగొస్తున్న బంగారం ధరలు... 

అన్ లాక్ 2 సమయంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.  ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరిన ధరలు మెల్లిగా దిగొస్తున్నాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 30 తగ్గి రూ.46,890కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30 తగ్గి రూ.51,170కి చేరింది. మార్కెట్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం పెరిగింది.  కిలో వెండి ధర రూ. 50 పెరిగి రూ. 52,000కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీ నుంచి డిమాండ్ ఉన్న కారణంగా వెండి ధర పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు.