శుభ‌వార్త‌.. మ‌ళ్లీ త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

శుభ‌వార్త‌.. మ‌ళ్లీ త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

బంగారం ధ‌రలు స్థిరంగా కొన‌సాగ‌డంలేదు.. ఓరోజు త‌గ్గితే.. మ‌రోరోజు భారీగా పెరుగుతుంది.. ఇక‌, బంగారం కొనేవారికి మ‌రోసారి గుడ్‌న్యూస్ చెబుతూ.. కాస్త త‌గ్గింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర కింద‌కి దిగింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 క్షీణించి.. రూ.51,170కు దిగిరాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.46,910కు ప‌డిపోయింది.. ఇక‌, వెండి ధర కూడా ఇదే దారిలో ప‌ట్టింది.. రూ.90 త‌గ్గ‌డంతో కిలో వెండి ధ‌ర రూ. 52,120గా ప‌లుకుతోంది. మ‌రోవైపు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 త‌గ్గ‌డంతో.. రూ.47,750కు దిగిరాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.48,950కు ప‌డిపోయింది.. ఇక వెండి రూ.90 త‌గ్గి.. కిలో వెండి రూ.52,120కు దిగొచ్చింది.