మ‌గువ‌ల‌కు షాక్‌... బ‌ంగారం ధ‌ర కొత్త రికార్డులు

మ‌గువ‌ల‌కు షాక్‌... బ‌ంగారం ధ‌ర కొత్త రికార్డులు

శ్రావ‌ణ‌మాసం వ‌చ్చింది.. క‌రోనా విజృంభిస్తున్నా.. కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. శుభ‌కార్యాలు, పెళ్లిళ్లు చేస్తున్నారు.. ఇదే స‌మ‌యంలో.. బంగారానికి డిమాండ్ పెరిగిపోతోంది.. దీంతో.. ప‌సిడి ధ‌ర కొత్త రికార్డులు సృష్టిస్తోంది.. ఆల్‌టైం హైకి చేరుకుంది.. అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం పరుగులు పెట్ట‌డంతో.. దేశీయంగా ప‌సిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెర‌గ‌డంతో.. రూ.55,310కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.370 పెరుగుదలతో రూ.50,740కు ఎగసింది. పసిడి ధర క్ర‌మంగా పెరగడం ఇది వరుసగా 8వ రోజు... ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావ‌డంతో ప‌సిడి ప్రేమికులు షాక్ తినాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు.. వెండి ధర కూడా పెరిగిపోయింది.. రూ.50 పెర‌గ‌డంతో కిలో వెండి ధర రూ.66,050కు చేరింది. 

ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పైకే క‌దిలింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెర‌గ‌డంతో రూ.51,500కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.52,700కు చేరింది.. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.30 శాతం పెర‌గ‌డంతో బంగారం ధర ఔన్స్‌కు 1960 డాలర్లకు చేరింది.