మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి ధర..

మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి ధర..

పండుగల సమయంలో మగువలకు గుడ్‌న్యూస్‌... బంగారం ధర భారీగా పడిపోయింది.. గత కొన్ని రోజులు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి బంగారం ధరలు.. అయితే.. పసిడి కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి భారీ ఊరట కలిగిస్తూ దాదాపు రూ.1900 వరకు తగ్గిపోయింది.. హైదరాబాద్ బులెలియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,890 తగ్గడంతో.. రూ.51,050కు పడిపోయింది.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,730 తగ్గుదలతో దీంతో ధర రూ.46,800కు పతనమైంది. 

బంగారం ధర తగ్గితే వెండి ధర కాస్త పైకి కదిలింది.. కేజీ వెండి ధర రూ.100 పెరగడంతో రూ.61,700కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం కిందకు దిగింది.. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1903 డాలర్లకు క్షీణించగా.. వెడిధర కూడా తగ్గుముఖం పట్టింది.. వెండి ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 24.34 డాలర్లకు దిగివచ్చింది. మొత్తానికి పండుగల సమయంలో మగవులకు ఇది శుభవార్తే అని చెప్పాలి.. ఇక, దసరా సమీపిస్తుండడంతో.. శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా పెరిగిపోతాయి.. వారికి కూడా బంగారం ధరలు ఉపశమనం కలిగించనున్నాయి.