మళ్లీ పెరిగిన పసిడి ధర..

మళ్లీ పెరిగిన పసిడి ధర..

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పరుగులు పెట్టింది. నిన్న కిందకు దిగిన పసిడి ధర ఇవాళ మళ్లీ పైకి కదిలింది.. కరోనా వైరస్‌ కేసుల పెరుగుదలతో పాటు అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్‌పై అస్పష్టతతో పసిడికి డిమాండ్‌ పెరిగింది. ఇక ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 213 పెరిగి రూ. 50,760కు చేరగా, కిలో వెండి ఏకంగా 1075 రూపాయలు భారమై 62,751 రూపాయలు పలికింది. మరోవైపు దేశ రాజధానిలో పదిగ్రాముల పసిడి 182 రూపాయలు పెరిగి 51,740 రూపాయలకు చేరింది. కిలో వెండి 805 రూపాయలు భారమై 63,714 రూపాయలకు ఎగబాకిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 1909 డాలర్లకు పెరిగాయి.