గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

వారం ఆరంభంలో భారీగా తగ్గిన బంగారం ధర మంగళవారం మళ్లీ పైకి కదిలింది.. అయితే, బంగారం కొనుగోలు చేయాలని చూసేవారికి గుడ్‌న్యూస్‌ చెబుతూ.. మరోసారి కిందికి దిగివచ్చింది.. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగినా.. దేశీ మార్కెట్‌లో మాత్రం క్షీణించింది... హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.780 తగ్గుదలతో రూ.50,950కు పడిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.390 క్షీణించి రూ.46,700కి పరిమితమైంది.. ఇక, వెండి కూడా పసిడిబాటే పట్టింది.. రూ.750 తగ్గడంతో.. కిలో వెండి ధర రూ.62,000కు పడిపోయింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1919 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 25.10 డాలర్లకు పెరిగింది.