మళ్లీ పైకి పసిడి ధర.. వెండిది అదే దారి..!

మళ్లీ పైకి పసిడి ధర.. వెండిది అదే దారి..!

బంగారం ధర మళ్లీ పెరిగింది.. ఒక వెండి కూడా అదే దారి పెట్టింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పైకి కదిలి.. రూ.46,000కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పెరగడంతో రూ.50,180కు ఎగిసింది.. ఇక, పసిడి దారిలోనే వెండి పరుగులు పెట్టింది.. రూ.300 పెరగడంతో కిలో వెండి ధర రూ.70,600కు చేరింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగి వచ్చింది.. బంగారం ధర ఔన్స్‌కు 1.27 శాతం తగ్గుదలతో 1827 డాలర్లకు క్షీణించగా.. వెండి ధర ఔన్స్‌కు 3.83 శాతం క్షీణతతో 24.81 డాలర్లకు పడిపోయింది.