శుభవార్త.. పసిడి ధర పతనం.. వెండిది అదే దారి..

శుభవార్త.. పసిడి ధర పతనం.. వెండిది అదే దారి..

ఒక రోజు కాస్త తగ్గినా.. ఈ వారంలో పెరుగుతూ వస్తోంది బంగారం ధర... అయితే, ఇప్పుడు పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెబుతూ భారీగా కిందకు దిగింది... అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర కిందకు దిగింది.. ఇక వెండి ధర కూడా పసిడి బాటే పట్టింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గడంతో.. రూ.53,430కు క్షీణించగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.270 తగ్గింది. దీంతో రూ.48,980కి పరిమితమైంది. 

ఇక, ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది.. కేజీ వెండి ధర రూ.580 దిగొచ్చింది. దీంతో వెండి కిలో ధర రూ.67,980కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర కిందకు దిగింది. ఔన్స్‌కు 0.82 శాతం తగ్గుదలతో పసిడి ధర 1948 డాలర్లకు దిగొచ్చింది. ఇక, వెండి ధర ఔన్స్‌కు 1.38 శాతం తగ్గుదలతో 26.91 డాలర్లకు పడిపోయింది.