మరోసారి భారీగా పెరిగిన పసిడి, వెండి ధర

మరోసారి భారీగా పెరిగిన పసిడి, వెండి ధర

బంగారం ధర భగ్గుమంటోంది.. రూ.40 వేల మార్క్ దాటి పరుగులు పెడుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పోటీ పడుతున్నాయి... ఆల్‌టైం హై ధరలను తాకిన పసిడి ధర.. కాస్త అటూ.. ఇటూ ఊగిసలాడుతోంది. ఇక, ఇవాళ మరోసారి భారీగా పెరిగింది. నేడు తులం బంగారం ధర రూ.558 పెరగగా.. కిలో వెండి ధర రూ.650 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ రూ.41,070గా పలికింది. ఇక, కిలో వెండి ధర రూ.49,650కు చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.40,300గా ఉండగా.. ముంబైలో రూ.40,330, కోల్‌కతాలో రూ.40,390గా ఉంది.