నేడు స్థిరంగా బంగారం ధరలు...

నేడు స్థిరంగా బంగారం ధరలు...

నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి మాత్రం షాక్ ఇచ్చింది. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 300 పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.70,700 వద్ద ఉన్నది.