మళ్ళీ తగ్గిన బంగారం... కరోనానే కారణం... 

మళ్ళీ తగ్గిన బంగారం... కరోనానే కారణం... 

బంగారం ధరలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి.  రెండు రోజుల క్రితం వరకు ఓ మోస్తరుగా పెరిగిన ధరలు మరలా తగ్గుముఖం పట్టాయి.  దీనికి కారణం లేకపోలేదు.  బంగారం కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడంతో పాటుగా అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పడిపోవడం కూడా ఒక కారణంగా ఉంది.  ఇక చైనాలో కరోనా వైరస్ కారణంగా బంగారంపై అక్కడి ప్రజలు పెద్దగా శ్రద్ద చూపకపోవడంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గిపోయాయి. 

దీని ప్రభావం ఇండియా మార్కెట్ పై కూడా ఉన్నది.  హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ. 39,110 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ.42,670కి చేరింది.  ఇక వెండి ధర భారీగా పతనం అయ్యింది.  దాదాపుగా రూ. 990 వరకు తగ్గింది.  ఈ తగ్గుదలతో కిలో వెండి ధర మార్కెట్లో రూ. 49,000గా ఉంది.