గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు... కానీ... 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు... కానీ... 

దేశంలో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.  కరోనా లాక్ డౌన్ సమయంలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఆ తరువాత మార్కెట్లు తిరిగి కోలుకొని పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.  అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది.  సోమవారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.45,010కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 తగ్గి రూ.49,100కి చేరింది.  బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి మాత్రం తగ్గలేదు.  వెండి ధర నిలకడగా రూ.64,700 వద్ద స్థిరంగా ఉన్నది.