మహిళలకు గుడ్న్యూస్ : భారీగా పడిపోయిన బంగారం ధరలు
దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ...తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ భారీగా పెరిగాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆకాశాన్ని తాకిన ధరలు ఆ తరువాత మార్కెట్లు తిరిగి కోలుకొని పుంజుకోవడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. దాంతో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ. 46,300కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1300 తగ్గి రూ. 50,500 కి చేరింది. అటు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 5500 తగ్గి రూ. 69,000కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)