శుభ‌వార్త‌.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌...

శుభ‌వార్త‌.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌...

బంగారం ప్రియుల‌కు శుభ‌వార్త‌.. ఆల్‌టైం హైరికార్డును సృష్టించిన బంగారం ధ‌ర‌.. క్ర‌మంగా దిగివ‌స్తోంది.. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరట క‌లిగిస్తూ.. మ‌రోసారి దిగివ‌చ్చింది ప‌సిడి ధ‌ర‌.. అంతర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర‌ల ప్ర‌భావంతో.. దేశీయ మార్కెట్‌లో పుత్త‌డి ధ‌ర త‌గ్గింద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.40 త‌గ్గి.. రూ.46,230 దిగిరాగా.. ఇదే స‌మంతో.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా అదేస్థాయిలో.. రూ.40 త‌గ్గ‌డంతో.. రూ.50,840కు ప‌డిపోయింది. పుత్త‌డితో పాటు వెండి ధ‌ర కూడా త‌గ్గింది.. రూ.50 త‌గ్గ‌డంతో.. కిలో వెండి ధ‌ర రూ.48,500కు చేరింది. మ‌రోవైపు అంత‌ర్జాతీయ మార్కెట్‌లోనూ పుత్త‌డి త‌గ్గుముఖం ప‌ట్టింది.. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం త‌గ్గ‌డంతో.. ఔన్స్‌కు 1786 డాలర్లకు పడిపోయింది. ఇక‌, ఢిల్లీలో మార్కెట్‌లో కూడా రూ.40 చొప్ప‌న త‌గ్గ‌డంతో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,110కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,310కి చేరింది.