శుభవార్త: మళ్ళీ పడిపోయిన బంగారం, వెండి 

శుభవార్త: మళ్ళీ పడిపోయిన బంగారం, వెండి 

గత కొంతకాలంగా దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.  పెరిగితే భారీగా పెరుగుతున్నది. తగ్గితే అదే రేంజ్ లో భారీగా తగ్గుతున్నాయి.  నిన్నటి రోజున వేయ్యి రూపాయల వరకు తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా పతనం దిశగానే అడుగులు వేసింది.  ఈరోజు బంగారం ధర రూ. 370 తగ్గింది.  అటు వెండి ధరలు కూడా పతనం అయ్యాయి.  కేజీ బంగారం ధర రూ. 400 తగ్గింది.  

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 41,780 గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 37,930గా ఉంది.  ఇక కిలో వెండి ధర రూ. 49,100గా ఉన్నది.  ప్రస్తుతానికి ఈ ధరలు తగ్గుముఖం పట్టినా, రానున్న కాలంలో వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.