మహిళలకు గుడ్‌ న్యూస్‌ : తగ్గిన బంగారం ధరలు

మహిళలకు గుడ్‌ న్యూస్‌ : తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. దీపావళి, పెళ్లిళ్లు ఉండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా నేపథ్యం తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.   అయితే... తాజాగా  బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు నిలకడగా ఉండగా.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా తగ్గినట్టు నిపుణులు చెప్తున్నారు.  తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.47, 600 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.51, 930కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 300 తగ్గి రూ.68, 100కి చేరింది.