బ్యాడ్ న్యూస్ : భారీగా పెరిగిన బంగారం ధరలు

బ్యాడ్ న్యూస్ : భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. లాక్ డౌన్ సమయంలో భారీగా పెరిగిన ధరలు ఆ తరువాత తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో తరువాత క్రమంగా బంగారం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.  అటు ప్రపంచ మార్కెట్లు సైతం బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.46,200కి చేరింది.  ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.50,400కి చేరింది.  ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది.  కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.70,400కి చేరింది.