బ్యాడ్ న్యూస్ : పెరిగిన పసిడి ధర..

బ్యాడ్ న్యూస్ : పెరిగిన పసిడి ధర..

మన దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.  అందుకే బంగారానికి దేశంలో డిమాండ్ అధికంగా ఉంటుంది.  ధరలు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయి.  ఏ మాత్రం ధరలు తగ్గినా, పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోలు జరుగుతుంది. అయితే.. కరోనా విజృంభణ తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే.. ఆల్‌ టైం రికార్డుకు చేరుకున్నాయి బంగారం ధరలు. తాజాగా.. మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 46,050 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 50,230 కి చేరింది.  ఇక వెండి మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి రూ. 71, 300 పలుకుతుంది.