ఈరోజు బంగారం ధరలు ఇలా...?

ఈరోజు బంగారం ధరలు ఇలా...?

బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.. రెండు రోజులు కాస్త కిందికి దిగివచ్చిన పసిడి ధర.. మళ్లీ పెరిగింది... అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పైకి ఎగసి రూ.47,190 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.43,260 కు చేరింది. ఇక ఈరోజు వెండి మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.73,800 వద్ద ఉంది.