గుడ్ న్యూస్ : నేడు తగ్గిన బంగారం ధరలు...

గుడ్ న్యూస్ : నేడు తగ్గిన బంగారం ధరలు...

బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్‌న్యూస్‌. కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి.  అన్‌సీజన్, అంతర్జాతీయ పరిణామాలతో పుత్తడి ధర తగ్గు ముఖం పడుతోంది.  నిన్న మొన్నటి వరకు...50వేల మార్క్‌కు చేరిన బంగారం ధరలు దిగి వస్తున్నాయి. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో 47,180 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150  రూ. 43,250 కు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.1,700 తగ్గి రూ.73,300 కి చేరింది.