షాకింగ్ : భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉండటంతో పాటుగా, దేశీయంగా కూడా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే, మంగళవారం రోజున బంగారం ధరలు కొంతమేర పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 360 పెరిగి రూ.43,050కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 46,970కి చేరింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా ఈరోజు భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ.73,300కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)