బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు

బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు

మనదేశంలో బంగారం కొనడానికి మహిళలు ఎంతో ఇష్టపడతారు. ధర ఎంత ఉన్నప్పటికీ బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే...   గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  ఇక తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి.  తగ్గిన ధరలను బట్టి ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం విలువ ఎంత ఉన్నదో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.41,450కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ. 45,220కి చేరింది.  ఇక బంగారంతో పాటుగా వెండి కూడా భారీగా తగ్గింది.  కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ. 69,900కి చేరింది.  అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై పడింది.