మహిళలకు మరోసారి షాకిచ్చిన బంగారం...భారీగా పెరిగిన ధరలు

మహిళలకు మరోసారి షాకిచ్చిన బంగారం...భారీగా పెరిగిన ధరలు

బంగారం అంటే మహిళలు పడిచస్తారు. ఎంతో రేటు ఉన్నప్పటికీ బంగారం కొనేందుకు మహిళలు ఆలోచించరు. ఇక మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరిగి రూ. 47,460 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 43,500 కు చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 72,100 వద్ద కొనసాగుతోంది.