గుడ్ న్యూస్: బంగారం పెరుగుదలకు బ్రేక్... ఎంత తగ్గిందంటే... 

గుడ్ న్యూస్: బంగారం పెరుగుదలకు బ్రేక్... ఎంత తగ్గిందంటే... 

గత 9 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో బంగారం పెట్టుబడులు పెట్టేందుకు ముదుపరులు ఆసక్తి చూపుతున్నారు.  దీంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.  గత తొమ్మిది రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.  అయితే, ఈ ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.  బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 43,300కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,350కి చేరింది.  ఇక కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ.71,600కి చేరింది.