మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధర... ఇవాళ మాత్రం భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 47,670 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100  తగ్గి రూ. 43,700 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా... వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 71,900 వద్ద కొనసాగుతోంది. గత మూడు రోజులుగా వెండి ధరలు నిలకడగా ఉండటం విశేషం.