మగువలకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

మగువలకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

లాక్ డౌన్ కాలంలో పుత్తడి ధరలు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే.  అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు.  పైగా ఆగష్టు నెలలో రికార్డ్ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. అయితే, గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 తగ్గి 49,480కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 తగ్గి రూ.54,050కి చేరింది.  ఇక కిలో వెండి ధర రూ.1200 తగ్గి రూ.65,500కి చేరింది.