పెరిగిన పసిడి... వెండి ధరలు..!

పెరిగిన పసిడి... వెండి ధరలు..!
అక్షయ తృతీయ సందర్భంగా ఈ మధ్య కాలంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు నిన్న బ్రేక్‌ పడింది. అయితే నిన్న అమాంతం రూ.350 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800కి చేరింది. కానీ.. ఈ రోజు మాత్రం మళ్లీ పసిడి ధర పెరిగింది. కాగా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెరగడం, స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ అధికమవ్వడంతో ఈ రోజు పసిడి ధర రూ.300 పెరిగి, 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100గా నమోదైంది. అలాగే.. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర కూడా రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 40వేలకు చేరడం విశేషం.