బ్యాడ్ న్యూస్‌... భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

బ్యాడ్ న్యూస్‌... భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

ఇది బంగారం ప్రియుల‌కు చేదు వార్త‌.. ముఖ్యంగా బంగారం కొనాల‌ని చూసేవారికి షాక్.. ఎందుకంటే.. బంగారం ధ‌ర భారీ పెరిగింది.. కొత్త రికార్డుల‌ను సృష్టిస్తూ ఆల్‌టైమ్ హైకి చేరింది.. వ‌రుస‌గా దిగివ‌స్తున్న బంగారం ధ‌ర‌కు బ్రేక్‌లు వేస్తూ.. నిన్న‌టి నుంచి మ‌ళ్లీ పెరుగుతోంది ప‌సిడి ధ‌ర‌.. ఇవాళ కూడా భారీగా పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర పెరుగుల కూడా దీనికి తోడైంది. దీంతో.. హైద‌రాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 పెర‌గ‌డంతో.. రూ.51,460కు చేరి కొత్త రికార్డు సృష్టించింది గోల్డ్ ప్రైస్.. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.400 పెరుగుదలతో రూ.47,180కు చేరింది. ఇక‌, ప‌సిడితో పాటు వెండి ధ‌ర కూడా ప‌రుగులు పెట్టింది.. ఏకంగా రూ.1,880 పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.51,900కు ఎగసింది. మ‌రోవైపు ఢిల్లీ మార్కెట్‌లోనూ ప‌సిడి ప‌రుగులు తీసింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెర‌గ‌డంతో రూ.47,900కు చేర‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.400 పెరిగి.. రూ.49,100కు చేరింది..