మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర..
పసిడి ధరలు మరోసారి కిందకు దిగివచ్చాయి... ఇక, వెండి కూడా బంగారం బాటే పట్టింది... అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో.. దేశీయ మార్కెట్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి.. రూ.50,120కు పడిపోగా... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.45,940కు పరిమితం అయ్యింది. ఇక, కేజీ వెండి రూ.100 కిందికి దిగడంతో.. రూ.71,300కు తగ్గిపోయింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 1855 డాలర్లకు పడిపోగా.. వెండి ధర మాత్రం పైకి కదిలింది.. ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 25.65 డాలర్లకు పెరిగింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)