భగ్గుమన్న బంగారం ధర.. రూ.42 వేలు దాటి పరుగు...

భగ్గుమన్న బంగారం ధర.. రూ.42 వేలు దాటి పరుగు...

మరోసారి బంగారం ధరలు భగ్గుమన్నాయి... బంగారానికి తోడు వెండి కూడా పరుగులు పెడుతోంది... బుధవారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.462 పెరగడంతో... ఏకంగా రూ.42,339కి చేరుకుంది. ఇక, వెండిదీ కూడా అదే దారి.. కిలో వెండి ధర ఒక్కరోజులో రూ.1,047 పెరగడంతో.. కిలో ధర రూ.48,652కి పరుగుపెట్టింది. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు... దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం కారణంగా చెబుతున్నారు... దానికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, నగలు కొనుగోళ్లు పెరగడంతో.. బంగారం ధర పైపైకి ఎగబాకుతోంది. మరోవైపు... పుత్తడి ధరలు భగ్గుమనడంపై కరోనా వైరస్ ఎఫెక్ట్ కూడా లేకపోలేదు.