భారీగా పెరిగిన బంగారం ధర.. అక్కడ అలా.. ఇక్కడ ఇలా...
బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్.. ఏ చిన్ని శుభకార్యం జరిగినా.. పసిడి ఉండాల్సిందే... ఇక, పెళ్లి లాంటి శుభకార్యాలకు వాళ్ల రేంజ్‌ను బట్టి బంగారు నగలు చేయిస్తుంటారు.. దీంతో... అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తగ్గినా.. కొన్నిసార్లు మాత్రం దేశీయంగా డిమాండ్ పెరగడంతో పాటు.. ధర కూడా భారీగా పెరుగుతూ ఉంటుంది.. అలాంటి పరిస్థితే మళ్లీ ఇప్పుడు కూడా వచ్చింది.. దీంతో.. వరుసగా దాదాపు వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరకు బ్రేక్‌లు పడినట్టు అయ్యింది.. బంగారంతో పాటు వెండి ధర కూడా పైపైకి కదులుతూ పరుగులు పెట్టింది.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి.. రూ.50,990కు ఎగబాకగా.. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.370 పెరుగుదలతో రూ.46,780కు చేరింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా పరుగులు పెట్టింది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.820 పెరగడంతో.. మరోసారి వెండి రూ.50 వేల మార్క్‌ను క్రాస్ చేసింది.. కిలో వెండి ధర రూ. 50,020కు పెరిగింది. ఇక, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250పైకి కదిలి.. రూ.47,500కు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరగడంతో రూ.48,700కు పరుగులు పెట్టింది.. అయితే. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది.. పసిడి ధర ఔన్స్‌కు 0.19 శాతం దిగొచ్చింది.. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1817 డాలర్లకు తగ్గింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)